ప్రధానమైనవని ఆయన ఒక పత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. సంక్షోభంలో వున్న పెట్టుబడిదారీ బ్యాంకులకు ఉద్దీపనల కింద పెద్దయెత్తున సొమ్ము ఇవ్వటం కన్నా అందులో కొంత భాగాన్ని పోషకాహారలోపం, అనారోగ్యంతో బాధపడుతున్న ఆఫ్రికన్ ప్రజలకు ఇస్తే ఎంతో మేలని ఆయన పేర్కొన్నారు ఆయుధాల సేకరణ, యుద్ధాల కోసం వెచ్చించే కోట్లాది డాలర్లలో కొంతభాగమైనా అన్నార్తుల కోసం, ఔషధాలకోసం వెచ్చించగలిగితే సమస్యల పరిష్కారానికి మనం కొంతవరకైనా సహకరించిన వాళ్లమవుతామని ఆయన సూచించారు. పెట్టుబడిదారీ ప్రభుత్వాలు తమ ఆర్థిక వ్యవస్థలను రక్షించుకునేందుకు వెచ్చిస్తున్న దానిలో కనీసం ఒక శాతం ఏటా ఆకలితో అలమటిస్తున్న కోట్లాది మంది ప్రజలకోసం వెచ్చించగలిగితే ఈ సమస్యను పరిష్కరించవచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ప్రపంచ జనాభాలో సగానికి పైగా వున్న 300 కోట్ల మంది పేదవాళ్ల కంటె 300 మంది అత్యంత ధనికుల వద్దే ఎక్కువ సంపద పోగుపడి వుందని అల్ జజీరా ఛానల్ ఒక నివేదికలో వెల్లడించింది. ఇదంతా ఒక ఎత్తయితే అమెరికాలో ఏటా ఉత్పత్తి అవుతున్న ఆహార పదార్ధాలలో 40 శాతం మేర వృధా అవుతోందని, ముఖ్యంగా సూపర్ మార్కెట్లన్నీ ఇటువంటి వృధాలో భాగస్వాములుగా వున్నాయని ఒక అధ్యయనంలో వెల్లడయింది. ప్రపంచ వ్యాప్తంగా వృధా అవుతున్న ఆహార పదార్ధాలలో నాలుగోవంతు ఆహారంతో ప్రపంచంలో ఆకలితో బాధపడుతున్న 87 కోట్ల మంది ఆకలి తీర్చవచ్చని, ప్రకృతి పరిరక్షణ- మార్గాన్వేషణపై ఇటీవల నేపుల్స్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పలువురు అభిప్రాయపడ్డారు. 1946 తరువాత ప్రపంచంలో ఆహారోత్పత్తి పెరిగిందని, గత రెండు దశాబ్దాలలో పోషకాహార లోపం 18.7 శాతం నుండి 11.3 శాతానికి పడిపోయిందని నిపుణులు చెబుతున్నప్పటికీ ఆహార భద్రత ఇప్పటికీ కీలకమైన అంశంగానే మిగిలిపోవటం విశేషం. పారిశ్రామిక దేశాల్లో ఏటా వృధా అవుతున్న ఆహార పదార్ధాల విలువ 68 వేల కోట్ల డాలర్లకు పైగా వుంటుందని జర్మనీకి చెందిన సేవ్‌ఫుడ్ కాంపెయిన్ సంస్థ అంచనా వేసింది. అభివృద్ది చెందిన దేశాలు ఏటా వృధా చేస్తున్న దాదాపు 2.22 కోట్ల టన్నుల ఆహారం సబ్‌సహారన్ ఆఫ్రికా దేశాలలో ఉత్పత్తి అవుతున్న మొత్తం ఆహారానికి 2.1కోట్ల టన్నుల కంటె ఎక్కువేనని ఈ సంస్థ చెబుతోంది. ప్రపంచంలో ప్రతి 15 సెకండ్లకు ఒకరు ఆకలిచావుతో మరణిస్తున్నారన్న ఐరాస అంచనాలుపరిశీలిస్తే ధనిక దేశాలు అనుసరిస్తున్న ఈ వ్యవహారం ఎంత సిగ్గుచేటయిన విషయమో అర్ధమవుతుంది.
18, అక్టోబర్ 2014, శనివారం
ఒక వైపు ఆహారం వృథా... మరో వైపు ఆకలి చావులు

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి