13, అక్టోబర్ 2014, సోమవారం

బ్రెజిల్‌ గవర్నర్‌గా కమ్యూనిస్టు

                 గత ఆదివారం నాడు జరిగిన బ్రెజిల్‌ ఎన్నికలలో తొలిసారిగా 27 రాష్ట్రాలకు గాను ఒక చోట కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఫ్లావియో దినో గవర్నర్‌గా ఎన్నికయ్యాడు. పదిహేను సంవత్సరాల పాటు న్యాయమూర్తిగా పనిచేసిన 45 సంవత్సరాల ఫ్లావియో ఉద్యోగానికి రాజీనామా చేసి 2006లో కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. బ్రెజిల్‌ నియంతల పాలనలో కమ్యూనిస్టుగా ఉన్నందుకు ఆయన తండ్రి 32 సంవత్సరాల పాటు జైలులో ఉన్నారు. ఈ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ పది హేడు రాష్ట్రాల అసెంబ్లీలలో 25 స్థానాలను, పార్లమెంట్‌లో తొమ్మిది రాష్ట్రాల నుంచి పది స్థానాలను గెలుచుకుంది. వామపక్ష వర్కర్స్‌ పార్టీ నాయకురాలు దిల్మా రౌసెఫ్‌ రెండవ సారి అధ్యక్ష పదవికి పోటీ పడుతూ మొదటి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నెల 26 తుది విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఆమెకు కమ్యూనిస్టు పార్టీ మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి